prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 10:16 am Digital Edition : PRAJA VANI

తోలుకట్టలో గణేశుడి లడ్డును దక్కించుకున్న ప్రశాంత్‌ చారి (బబ్బీ)

*తోలుకట్టలో గణేశుడి లడ్డును దక్కించుకున్న ప్రశాంత్‌ చారి (బబ్బీ)*

*విశ్వకర్మ యువజన సంఘం గణేష్‌ మండపంలో రూ.40 వేలకు లడ్డు వేలం*

మొయినాబాద్‌: మొయినాబాద్‌ మండల పరిధిలోని తోలుకట్ట గ్రామంలో విశ్వకర్మ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపంలో లడ్డు వేలం నిర్వహించారు. ఈ వేలంలో ప్రశాంత్‌ చారి (బబ్బీ) రూ.40 వేలకు గణేశుడి లడ్డును దక్కించుకున్నారు.

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేలంలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. గణేశుడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న ప్రశాంత్‌ చారి (బబ్బీ)కి మండప నిర్వాహకులు అభినందనలు తెలిపారు.