prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 6:01 pm Digital Edition : PRAJA VANI

తొలిముద్దతో పోషకాహార భరోసా

*తొలిముద్దతో పోషకాహార భరోసా*
. పస్రాలో తల్లులకు సూపర్ వైజర్ శారద సూచనలు.

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పస్రా సెక్టార్లోని పస్రా-5 అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ శారద తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.గర్భస్థ దశ నుండి రెండు సంవత్సరాల వరకు 1000 రోజుల ప్రాముఖ్యతను, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీలో ఇస్తున్న పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.అంగన్వాడీ కేంద్రాల్లో 3-6 సం. పిల్లలకు ఒకరోజు ఉప్మా, ఒకరోజు కిచిడీతో పాటు “తొలిముద్ద” ద్వారా పోషకాహార భరోసా లభిస్తుందని, శరీరానికి హాని కలిగించే స్నాక్స్, బిస్కెట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ పిల్లలకు ఇవ్వవద్దని, ఇంట్లో తయారు చేసిన ఆహారమే ఇవ్వాలని కోరారు.మూడు సంవత్సరాల నుండి పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీకి పంపించాలని, అక్కడ ఇస్తున్న ఒక్కపూట భోజనం, పాలు, గుడ్లు, బాలామృతం తీసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు.
SAM, MAM పిల్లలకు ఇచ్చే బాలామృతం ప్లస్ తప్పకుండా తినిపించాలని, ప్రతి ఒక్కరూ “మన అంగన్వాడీ – మన బాధ్యత”గా భావించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ICPS జ్యోతి, ప్రథమ్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, సెక్టార్ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు, తల్లులు పాల్గొన్నారు.