prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:47 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

తొర్రూరులో ఘనంగా చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

తొర్రూరులో ఘనంగా చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండలాధ్యక్షుడు తాళ్ల మల్లయ్య అధ్యక్షతన ఘనంగా డాక్టర్ చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు తొర్రూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించడం జరిగింది. శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టి యు ఎఫ్ జిల్లా అధ్యక్షులు ముద్దసాని వెంకటేశ్వర్లు జిల్లా కోఆర్డినేటర్, కొండ వెంకన్న, రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు సమూహంగా మాట్లాడుతూ, డాక్టర్ చీమ శ్రీనివాస్, గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమకారుల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాడని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి ఆదరణ లేకుండా, గత పాలకవర్గం నిర్లక్ష్యం చేయడంతో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన ఉద్యమకారులకు న్యాయం చేకూర్చాలని ఉద్దేశంతో, అనేక కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ ఉద్యమకారులను చీమ శ్రీనివాస్ చైతన్య పరుస్తున్నాడు అన్నారు. కావున చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు శుభ సందర్భంగా, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేకూరాలని, ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు అయిన శ్రీనివాస్ కి భగవంతుడు ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు, చల్లగా చూడాలని వారు ఆకాంక్షించారు. తొర్రూరు మండలం కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో, జిల్లా నాయకులు సధాకర్, పంతం సురేందర్, దస్తగిరి, రంగు రమణ, పైండ్ల వెంకటయ్య, వెంకన్న, గాద గాని రమేష్, తదితరులు పాల్గొన్నారు