prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 11:47 am Digital Edition : SURENDHAR MAHEBUBABAD

తొర్రూరులో ఘనంగా గణపయ్య నిమజ్జనోత్సవం

తొర్రూరులో ఘనంగా గణపయ్య నిమజ్జనోత్సవం

 

పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్విని రెడ్డి టీపిసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్

ఘనంగా తొర్రూరులో గణపతి నిమర్జనం ఉత్సవ కార్యక్రమం
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తొర్రూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా ముగిశాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ప్రతిష్ఠించిన శ్రీ మట్టి గణపయ్య నిమజ్జన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు
నిమజ్జనానికి ముందు గణపయ్యకు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, గణపతి నామస్మరణల మధ్య శోభాయాత్రను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే మట్టి గణపతుల ప్రతిష్ఠాపన ప్రతి ఇంటా ఆదర్శంగా మారాలని, విఘ్నేశ్వరుడి కృపతో పాలకుర్తి నియోజకవర్గ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సుభిక్షం, ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ తొర్రూరు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మోత్కూరు రవీంద్ర చారి పట్టణ అధ్యక్షుడు పదో వార్డు కౌన్సిలర్, ముద్దసాని సురేష్, కాంగ్రెస్ జిల్లా నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్, మంగళపల్లి రామచంద్రయ్య గంజి ప్రసాద్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్, సురేందర్ రెడ్డి , గంజి దేవేందర్ రెడ్డి, పింగిలి ఉష, దొంగరి రేవతి మహేశ్వరి, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.