తెలుగు వెలుగులు పంచిన సౌదామని – దేవరుప్పులలో ఘనంగా వ్యాసరచన పోటీలు

*తెలుగు వెలుగులు పంచిన సౌదామని - దేవరుప్పులలో ఘనంగా వ్యాసరచన పోటీలు* *విద్యార్థుల కలంతో తెలుగు భాష వైభవం* జనగామ జిల్లా ప్రతినిధి (దేవరుప్పుల), సెప్టెంబర్ 26 (ప్రజావాణి): "తెలుగు భాష మన బతుకు, మన వెలుగు" అనే నినాదంతో దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం శనివారం సాహిత్య సందడితో మార్మోగింది. సౌదామని సాహిత్య సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతకు అద్దం పట్టాయి. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చింత ప్రసాద్...