prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 6:05 pm Digital Edition : PRAJA VANI

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ

దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాకీ చంద్ర భాను

మద్దూరు సెప్టెంబర్ 26, ప్రజా వాణి,

తెలంగాణ రైతాంగ సాధ సాయుధ పోరాటంలో భూస్వామ్య దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగిన చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట కేంద్రంలోని శనివారం నాడు ఆమెకు ఘనమైన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా దళిత సేన నాయకులు మాట్లాడుతూ దోపిడి వర్గం పేద ప్రజలను వంచిస్తున్నటువంటి రోజులలో స్త్రీల యొక్క శక్తి గొప్పదని నిరూపించి దొరల దౌర్జన్యాలు దోపిడీలను చేస్తున్నటువంటి వారిని ఎదిరించి తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ఉద్యమ చైతన్యాన్ని నిలిపినటువంటి చాకలి ఐలమ్మ ఎప్పటికీ చిరస్మరణీరాలని దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బాకీ చంద్ర భాను అన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల మనీష్ కుమార్ జిల్లా బాధ్యులు దేవర మల్లయ్య మరియు ఇతర నాయకులు శ్రావణ్ కుమార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.