తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి జీ.పరమేష్
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: జీ. పరమేష్ పూడూరు ముదిరాజ్ సంఘం వద్ద ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి పూడూరు, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పూడూరు ముదిరాజ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు జీ. పరమేష్ కోరారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామంలోని ముదిరాజ్ సంఘం...