తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు…సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా సాయుధ పోరాట వారోత్సవాలు

ఘట్కేసర్, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వామ్య, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన గొప్ప ప్రజా ఉద్యమాలలో ఒకటని సీపీఐ సీనియర్ నాయకులు, కె.ఎల్. మహేంద్రనగర్ కాలనీ వ్యవస్థాపకులు టి. మల్కయ్య అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఐ ఘట్కేసర్ మండల సమితి ఆధ్వర్యంలో అన్నోజిగూడలోని కె.ఎల్. మహేంద్రనగర్ వికలాంగుల కాలనీలో ర్యాలీ నిర్వహించి, కె.ఎల్. మహేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టి. మల్కయ్య మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, జమీందారీ–దొరల...