prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:48 pm Digital Edition : PRAJA VANI

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల ఆశయాలను కొనసాగిద్దాం

*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల ఆశయాలను కొనసాగిద్దాం!*

ఎం ఎల్ పి ఐ రెడ్ ఫ్లాగ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18(ప్రజావాణి):పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద శుక్రవారం మార్క్సిస్ట్ లేనినిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 ను పురస్కరించుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతూ నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా జనగామ జిల్లా కార్యదర్శి “మాన్యపు భుజేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.డి కాసిం, రాష్ట్ర కమిటీ సభ్యులు సుధమల్ల భాస్కర్, చేతుల మీదుగా అక్టోబర్ 29, 30 తేదీలలో హైదరాబాదులో జరిగే పార్టీ రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన ఆవిష్కరించారు. ఖాసీం, భాస్కర్ లు మాట్లాడుతూ భూమి భుక్తి వెట్టి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని, ఆ పోరాటంలో జనగామ జిల్లా కీలకపాత్ర పోషించిందని ఆ పోరాట వీరుల ఆశయాలను మరవకుండా తెలంగాణ ప్రజానీకం ముందుకు తీసుకుపోవాలని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి బిజెపికి అసలు సంబంధమే లేదని అట్లాంటిది బిజెపి వాళ్లు విమోచనమంటూ హిందూ ముస్లింల పోరాటంగా చిత్రీకరించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. త్యాగం కమ్యూనిస్టులది భోగం మతోన్మాదులది అయిపోయింది అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పైండ్ల యాకన్న, మిట్ట అంజన్న, జన సాంస్కృతిక కళామండలి జనగామ జిల్లా కార్యదర్శి ఎం.డి అబ్బాస్, రేండ్ల ఉమా, బీసీ మహిళ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు దుంపల లక్ష్మి, ఎండి నబీన్ సాబ్, రాజు తదితరులు పాల్గొన్నారు.