తెలంగాణ రైతాంగ సాయుధ పో
రాట స్ఫూర్తితో ఉద్యమించండి….
చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాద శక్తులు.
సిపిఎం పార్టీ తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీసిపిఎం పార్టీ జిల్లా నాయకులు బొల్లం అశోక్, ఎండి యాకూబ్.
తొర్రూరు సెప్టెంబర్ 17.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాద శక్తుల వ్యతిరేకంగా పోరాడాలి అని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బొల్లం అశోక్, ఎండి యాకూబ్ లు అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ముగింపు సందర్భంగా తొర్రూరు మండలంలో మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలో అన్ని గ్రామాల్లో అమరవీరుల స్థూపాల దగ్గర పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్, మండల కార్యదర్శి ఎండి యాకూబ్ లు మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో నాడుభూమి కోసం, భుక్తి కోసం, వేట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహత్తర పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని వారు కొనియాడారు, ఆ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఆ పోరాటానిదని వారు అన్నారు. 4 వేల గ్రామాలలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయని ప్రజలు అన్ని హక్కులతో స్వేచ్ఛగా జీవించారని వారు గుర్తు చేశారు. ఇంతటి మహత్తర పోరాటం ప్రపంచ చరిత్రలో పూటల్లో లికించబడిందని, ఇలాంటి పోరాటాన్ని ఇప్పుడున్న పాలకులు కుల మతాల మధ్య జరిగిన పోరాటంగా వక్రీకరిస్తున్నారు. కుల మతాల మధ్య జరిగిన పోరాటం కాదని విముక్తి పోరాటమని వారు అన్నారు. ఆ పోరాటాన్ని ఇప్పుడున్న పాలకులు మతోన్మాద శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్నాయని, చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర మారదని ప్రజలందరూ నాడు జరిగినటువంటి మహత్తర పోరాటం కమ్యూనిస్టుల త్యాగాల గురించి తెలుసుకోవాలని గ్రామ గ్రామాన సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తొర్రూర్ లో పూసల వెంకటయ్య స్తూపం దగ్గర పూలమాలవేసి నివాళులర్పించి సభ నిర్వహించడం జరిగింది. హరిపిరాల గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు వల్లపు కొమురెల్లి, గోపాలగిరిలో ఉద్యమ నాయకులు యనమాల వెంకటయ్య, కంటాయపాలెం గ్రామంలో బండి స్వామి వేదాచారి, మార్కాపురం నరసయ్య,గుర్తుర్ లో పెరుమాండ్ల జగన్నాథం , అమ్మాపురం గ్రామంలో తమ్మెర వెంకట రామ నరసయ్య, ముద్దం శ్రీనివాస్ రెడ్డి స్తూపాలకు పూలమాలలేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరిపిరాల మాజీ సర్పంచ్ వల్లపు మల్లయ్య, శ్రీను, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు జన్నపరెడ్డి సోమిరెడ్డి, మార్క సాంబయ్య, జమ్మల శ్రీను, డొనక దర్గయ్య, సాయి మల్లు, కంటాయపాలెం గ్రామ ఉపసర్పంచ్ జితేందర్ రెడ్డి, ధరావత్ యాకన్న, వెంకట్ రెడ్డి ,, మట్టపల్లి కుమార్, తిమ్మిడి రవి,భాష గాని ప్రభాకర్ స్వరూప , కోటగిరి సంతోష్ ,రాము, క్రాంతి కుమార్, అనిల్, శోభన్ , కుమార్, షమీన భాగ్య , శైలజ,మంజుల సౌజన్య రాధా, యాకమ్మ, తదితరులు పాల్గొన్నారు