తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణ చేసిన -బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి బెజ్జంకి, సెప్టెంబర్ 1 (ప్రజావాణి) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తోట తిరుపతి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు సేవ చేయాలని అన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బెజ్జంకి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.