prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:05 am Digital Edition : PRAJA VANI

తెలంగాణ జర్నలిస్టుల టీజే జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా కాంపటి శ్రీనివాసరావు

*తెలంగాణ జర్నలిస్టుల టీజే జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా కాంపటి శ్రీనివాసరావు.*

సూర్యాపేట , సెప్టెంబర్ 21:( మన ప్రజావాణి)

తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేజేఏసీ)లో పలువురిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు తొగరి కరుణాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుంగ చాందిని తెలిపారు. నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షులు తమ హోదాలో తక్షణమే అధికారిక బాధ్యతలు చేపట్టాలని ఆమె కోరారు. జేఏసీ నియమ నిబంధనలను పాటిస్తూ, క్రమశిక్షణతో పనిచేయడంతో పాటు సంస్థ చేపట్టే తదుపరి కార్యక్రమాలను విజయవంతంగా సూచించారు. నిర్వహించాలని
కాంపాటి శ్రీనివాసరావు నీ
సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా నియమితులైన ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, సభ్యులు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.