తెలంగాణ ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
నంగునూరు, సెప్టెంబర్ 23:తెలంగాణ ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోల శ్రీధర్ గౌడ్ సర్పంచుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నంగునూరు మండల కేంద్రానికి చెందిన కోల శ్రీధర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.రాష్ట్ర స్థాయిలో ఫోరం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రాష్ట్రంలోని ఉప సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఫోరం నాయకులు ఆకాంక్షించారు.నియామక పత్రాన్ని అందుకున్న...