తెలంగాణ ఉద్యమ నేత జంగం రాజుకు కన్నీటి నివాళి
తెలంగాణ ఉద్యమ నేత జంగం రాజుకు కన్నీటి నివాళి ఎల్కతుర్తి మండలంలో విషాదం.. ఉద్యమకారులు, గ్రామస్తుల కన్నీటి పర్యంతం ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, ఎల్కతుర్తి సర్కిల్ పరిధిలో ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపించిన తెలంగాణ ఉద్యమ నేత,ఎల్కతుర్తి గ్రామశాఖ టిఆర్ఎస్ అధ్యక్షుడు జంగం రాజు మృతి చెందడంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో జంగం రాజు యువతను సమీకరించి ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.ఎల్కతుర్తి టి ఆర్ ఎస్ పార్టీ...