prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 12:24 pm Digital Edition : PRAJA VANI

తెలంగాణ ఉద్యమ నేత జంగం రాజుకు కన్నీటి నివాళి

తెలంగాణ ఉద్యమ నేత జంగం రాజుకు కన్నీటి నివాళి

ఎల్కతుర్తి మండలంలో విషాదం.. ఉద్యమకారులు, గ్రామస్తుల కన్నీటి పర్యంతం

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, ఎల్కతుర్తి సర్కిల్ పరిధిలో ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపించిన తెలంగాణ ఉద్యమ నేత,ఎల్కతుర్తి గ్రామశాఖ టిఆర్ఎస్ అధ్యక్షుడు జంగం రాజు మృతి చెందడంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో జంగం రాజు యువతను సమీకరించి ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.ఎల్కతుర్తి టి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పిట్టలు మహెందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన వంటావార్పు, నిరసనలు తదితర కార్యక్రమాల్లో ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువతతో కలిసి తెలంగాణ కోసం తనవంతు పోరాటం చేశారు.
తెలంగాణ ఉద్యమం పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తుగా అప్పటి ఉద్యమ కార్యక్రమాల్లో సగం గుండు గీయించుకుని తన నిరసనను వ్యక్తం చేసిన ఉద్యమకారుడిగా జంగం రాజుకు ప్రత్యేక గుర్తింపు ఉందని తోటి ఉద్యమకారులు గుర్తు చేసుకున్నారు.ఆయన వెంట అనేకమంది ఉద్యమకారులు,యువత నిలబడి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు.
జంగం రాజు మృతి చెందిన విషయం తెలుసుకున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారులు, ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ..తెలంగాణ కోసం మా కళ్ల ముందే పోరాడిన జంగం రాజు ఇక మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. ఉద్యమ సమయంలో ఆయన చూపిన చొరవ,యువతను ముందుకు నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన జంగం రాజు సేవలను ఉద్యమకారులు, గ్రామస్తులు స్మరించుకున్నారు.ఆయన మృతి ఎల్కతుర్తి మండలానికి, తెలంగాణ ఉద్యమకారులకు టి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు తీరని లోటని పేర్కొంటూ ఘనంగా నివాళులు అర్పించారు.