prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 2:55 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

తూర్పు తండాలో పోలీస్ కార్డెన్ సేర్చ్ తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్, ఎస్సై లు రవికుమార్, బానోత్ వెంకన్న

 

దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామంలో తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహుల పేట , దంతాలపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ గణేష్ మాట్లాడుతూ ఈ గార్డెన్ సెర్చ్ ప్రోగ్రాం తూర్పు తండాలో నిర్వహించగా ముగ్గురు వ్యక్తుల నుండి సుమారు 350 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఒక ఎనిమిది లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
అలాగే సుమారు 25 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి సంబంధిత ఓనర్ కు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టిన, చట్ట విరుద్ధమైన వ్యవహారాలు చేసిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు గుడుంబా గంజాయి లాంటి మారకద్రవ్యాల బారిన పడకుండా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, సమాజం పట్ల కుటుంబం పట్ల క్రమశిక్షణతో మెలగాలని ఆయన సూచించారు. ఎవరైనా అక్రమ బెల్లం గాని గుడుంబా గాని తయారు చేసినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సిఐ గ్రామ ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో దంతాలపల్లి ఎస్సై రవికుమార్, నరసింహుల పేట ఎస్ఐ బానోతు వెంకన్న, పోలీస్ సిబ్బంది సాయి కృష్ణ, గణేష్, తదితరులు పాల్గొన్నారు.