prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 3:29 pm Digital Edition : PRAJA VANI

తుఫాను బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారె

*తుఫాను బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారె*

దమ్మపేట, ప్రజావాణి న్యూస్, సెప్టెంబర్ 25:
రెండు రోజుల నుండి కురిసిన భారీ తుఫాను కు దెబ్బతిన్న రోడ్లను పంట పొలాలను  శాసనసభ్యులు జారె ఆదినారాయణ దమ్మపేట మండల పరిధిలోని జగ్గారం గ్రామపంచాయతీలో పర్యటించి పరిశీలించారు.ఈ పర్యటనలో భాగంగా సుడిగాలి తీవ్రతకు నేలకొరిగిన ఆయిల్ ఫామ్ జీడిమామిడి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల రైతాంగానికి జరిగిన నష్టం అత్యంత విచారకరమన్నారు.రైతులు అధైర్యపడొద్దని పంట నష్టానికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి బాధితులందరికీ ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం అందేలా తన వంతుగా కృషి చేస్తానని  హామీ ఇచ్చారు. దెబ్బతిన్న రహదారులకు త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వంకా జానకీ రామ్ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.