prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 10:13 am Digital Edition : PRAJA VANI

తుది దశకు చేరిన చేయూత పెన్షన్స్ సర్వే

తుది దశకు చేరిన చేయూత పెన్షన్స్ సర్వే
ఎంపీడీవో కుమార్.

ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చేయూత కొత్త పెన్షన్స్ దరఖాస్తుల వెరిఫికేషన్ సర్వే తుది దశకు చేరినట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని 31 గ్రామ పంచాయతీల నుంచి వివిధ రకాల చేయూత పెన్షన్ల కోసం 853 దరఖాస్తులు రాగా మంగళవారం సాయంత్రానికి 843 దరఖాస్తులను వెరిఫికేషన్ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. మిగిలి ఉన్న మరో 10 దరఖాస్తులు వెరిఫికేషన్ సర్వే చేయాల్సి ఉందని ఎంపీడీవో పేర్కొన్నారు. త్వరలోనే సంబంధిత దరఖాస్తులపై వెరిఫికేషన్ సర్వే పూర్తి చేయిస్తామని తెలిపారు.