తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి….రెడ్డి సామాజిక వర్గంపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ మేడిపల్లి, పోచారం పోలీసులకు ఫిర్యాదు….సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలు పెంచేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణ…..

పోచారం, సెప్టెంబర్ 9: రెడ్డి సామాజిక వర్గంపై అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ శాసనమండలి సభ్యుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రెడ్డి సంఘం నాయకులు మేడిపల్లి, పోచారం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 5న నకిరేకల్‌లో ముఖ్యమంత్రి సభ సందర్భంగా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న సంబంధాలపై మీడియాతో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారని ఫిర్యాదులో...