prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 7:40 pm Digital Edition : RRAJUREGONDA REGONDA

తిరుమలగిరి యువకుడు అఖిల్ మృతి – గ్రామంలో విషాదం

 

*రేగొండ, సెప్టెంబర్ 21 (ప్రజావాణి):* జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన తక్కళ్లపల్లి అఖిల్ (20) అనారోగ్యంతో మృతి చెందాడు.

 

గ్రామంలో డీజే, టెంట్ హౌస్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న అఖిల్ 20 రోజుల క్రితం కళ్లు తిరిగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మూడు రోజుల క్రితం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.

 

అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం గుండె కొట్టుకోవడం ఆగిపోయి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

 

మృతుడికి తల్లిదండ్రులు పద్మ, ఐలస్వామి, ఒక సోదరుడు ఉన్నారు. చిన్న వయసులో అఖిల్ మృతితో తిరుమలగిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.