prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 7:34 am Digital Edition : PRAJA VANI

తాళ్లపల్లి గ్రామంలో అన్నదానం కార్యక్రమం చేపట్టిన గడ్డమీది యువతరం

తాళ్లపల్లి గ్రామంలో అన్నదానం కార్యక్రమం చేపట్టిన గడ్డమీది యువతరం

షాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజావాణి):
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో వినాయక పూజా కార్యక్రమంలో భాగంగా గడ్డమీది యువతరం ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ ప్రజలకు అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా గడ్డమీది నరసింహులు, గడ్డమీది సత్తయ్య, గడ్డమీది లక్ష్మయ్య, గడ్డమీది మల్లేష్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సమ్మె చంద్రశేఖర్, సంఘం సభ్యులు పాల్గొని కార్యక్రమం సజావుగా జరిగేలా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు గడ్డమీది వెంకటేష్ తెలిపారు.

అన్నదాన కార్యక్రమానికి గడ్డమీది వెంకటేష్, గడ్డమీది ప్రశాంత్, గడ్డమీది పృథ్వీరాజ్, గడ్డమీది రాణి, గడ్డమీది వెంకటమ్మ, గడ్డమీది సులోచన, గడ్డమీది అమృతతో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకుని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.