prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 5:01 pm Digital Edition : PRAJA VANI

తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది

తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది

ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పిలుపుమేరకు

మండల పార్టీ అధ్యక్షులు బాలగని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో

దిష్టిబొమ్మ దగ్ధం

 

డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్8, ప్రజావాణి :

 

దళిత స్పీకర్‌పై గడ్డంమధు ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బాలగని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కురవి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. స్పీకర్ పీఠాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని మండిపడ్డారు. దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, తాతా మధు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

స్పీకర్ పీఠాన్ని అవమానించిన తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కురవి టౌన్ అధ్యక్షుడు నారాయణ రాజేంద్రకుమార్, సమన్వయ కమిటీ అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు