prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 8:27 pm Digital Edition : PRAJA VANI

తహసిల్దార్లు మారిన పనితీరు మాత్రం శూన్యం

తహసిల్దార్లు మారిన పనితీరు మాత్రం శూన్యం

అనంతపురం ప్రజావాణి ప్రతినిధి సెప్టెంబర్ 25 జిల్లా కేంద్రానికి కూత వేట దూరంలో ఉన్న కుడేరు మండలం కార్యాలయం లో యదేచ్చగా చేతివాటం ప్రదర్శించటం మాత్రం మారలేదు గత కొన్ని సంవత్సరాలగా ఒకరి పట్టాను వేరొకరికి మార్చి ఆన్లైన్లో భూమిని ఎక్కించడంలో అధికారులకు కొట్టిన పిండిగా మారిందని చెప్పవచ్చు,గతంలో కూడేరు మండలం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు వందల ఎకారాలు పాసుబుక్కులు రూపంలో నకిలీవని తేలటం అందరికీ విధితమే ప్రభుత్వం గతంలో అసైన్డింగ్ కమిటీలు ద్వారా భూమి లేని నిరుపేద కుటుంబాలకు రెండు ఎకరాలు చొప్పున భూ పట్టా పాస్ బుక్కులు జారి చేయడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని అధికారం చేతివాటం ప్రదర్శించి ఒకరి భూమిని మరొకరికి లేదా ఖాలీగా ఉన్న డిసి భూములు రిజర్వ్ ఫారెస్ట్ చెందిన భూములను డబ్బులు దండుకొని ఆన్లైన్లో పొందుపరచడం అనేకసార్లు జరిగిందని పలువురు వ్యక్తులు చర్చించుకుంటున్నారు, ఇది ఇలా ఉండగా ఇప్పేరు గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి చెందిన ఇప్పేరు పొలం సర్వేనెంబర 335 లో 23 ఎకరాల 22 సెంట్లు భూమి కలదు ఇందులో మిగులు భూమి 78 సెంట్లు భూమిని సదరు రైతు అనుమతి లేకుండా ఎలాంటి సమాచారం తెలపకుండా అధికారులు వేరే వారికి ఆన్లైన్లో చేర్చడం జరిగిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఆ రైతు తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ప్రజావాణి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంపై ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పట్టించుకునే నాధుడు లేరని తన గోడును చెప్పుకొచ్చారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు రైతు కి జరిగిన అన్యాయంపై విచారణ జరిపి తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది