తడ్కల్ లో కార్లతో గణపయ్యకు ఘన వీడ్కోలు

*తడ్కల్ లో కార్లతో గణపయ్యకు ఘన వీడ్కోలు..* సెప్టెంబర్ 23,( ప్రజావాణి) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం తడ్కల్ లో శ్రీ రామ్ కాలనీలో కొలువైన గణపయ్యను నిమజ్జన కార్యక్రమం కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో కార్లలో ఊరేగింపుగా తరలించారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. భక్తులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి ఘన వీడ్కోలు పలికారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తులు ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ నిమజ్జన ఊరేగింపు...