*తండాలనుపంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ దే : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి*
– గన్యాతండాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
– ఎస్టీ రిజర్వేషన్ 6% నుంచి 10%కి పెంచింది కేసీఆరే
– చిలిపిచెడ్ మండలంలో ఘనంగా పాలాభిషేక కార్యక్రమం
చిలిపిచెడ్, సెప్టెంబర్ 17 – ప్రజావాణి*
చిలిపిచెడ్ మండలం గన్యాతండాలో సర్పంచ్ నీల్యపాండు నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎస్టీల రిజర్వేషన్ ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. రిజర్వేషన్ పెంచి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పాలాభిషేకం చేయడం గర్వకారణంగా ఉందన్నారు.
3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, హైదరాబాద్ బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీల ఆత్మగౌరవాన్ని పెంచారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను ఆదుకున్నారని అన్నారు.
తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
కేసీఆర్ పాదయాత్ర సమయంలో ఒక గిరిజన ఇంట్లో బస చేసినప్పుడు జరిగిన సంఘటన ఆధారంగా, ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా పేదలకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టి పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించారని తెలిపారు. విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పెంచి ప్రోత్సహించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, సర్పంచులు నీలా పాండు, కున్యా, దరియా, మాజీ సర్పంచులు రాకేష్, శంకర్, యాదగిరి, గోపాల్ రెడ్డి, నాయకులు సంగా గౌడ్, ఎంసీ విఠల్, షఫీ, ధర్మారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ముకుందరెడ్డి, శంకరయ్య, బాల్ రెడ్డి, విభీషణ్ తదితరులు పాల్గొన్నారు.