prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 10:24 pm Digital Edition : PRAJA VANI

తంగళ్లపల్లిలో పేకాట ఆడుతున్న ఆరుగురు పట్టివేత

తంగళ్లపల్లిలో పేకాట ఆడుతున్న ఆరుగురు పట్టివేత

రూ.11,360 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం

కోహెడ, సెప్టెంబర్ 19 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన వేగ్గాలం చంద్రమౌళి, బుర్ర రమేష్, ఎగుర్ల ఐలయ్య, చుంచు సుమన్, పిల్లి అంజయ్య, సిగిరి రాజులు ఎగుర్ల ఐలయ్య ఇంట్లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.11,360 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు కోహెడ ఎస్సై అభిలాష్ తెలిపారు.