prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:16 am Digital Edition : PRAJA VANI

డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అనుసంధానంపై తప్పుడు ప్రచారం

డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అనుసంధానంపై తప్పుడు ప్రచారం
తిరుపతి, సెప్టెంబర్ 22: డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను సెప్టెంబర్ 25లోపు అప్‌డేట్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందని, చెల్లుబాటు కోల్పోతుందని సోషల్ మీడియా, వాట్సాప్‌లలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జిల్లా రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మి వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే రవాణా శాఖకు సంబంధించిన సేవలు, చలానాలు, లైసెన్స్ రెన్యువల్ తదితర సమాచారాన్ని సకాలంలో పొందేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌కు ప్రస్తుత మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ప్రయోజనకరమని పేర్కొన్నారు.
ధ్రువీకరించని సందేశాలను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని, డ్రైవింగ్ లైసెన్స్, రవాణా శాఖకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వర్గాల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని వాహనదారులకు అధికారులు సూచించారు.
— జిల్లా రవాణా శాఖ అధికారి, తిరుపతి