డ్రగ్ టెస్ట్‌కు మేము సిద్ధం.. రసమయి మీరు సిద్ధమా?- యూత్ కాంగ్రెస్ నాయకుల సవాల్

బెజ్జంకి, ఆగస్టు 31 (ప్రజావాణి) మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ యూత్ కాంగ్రెస్ నాయకులను డ్రగ్ అడిక్ట్‌లు అంటూ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. డ్రగ్ టెస్ట్‌కు తాము సిద్ధంగా ఉన్నామని మానకొండూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అట్లా అనిల్ తెలిపారు. సెప్టెంబర్ 7న బెజ్జంకిలో జరిగే కార్యక్రమానికి ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ కిట్లతో వచ్చి ప్రజల సమక్షంలోనే పరీక్షలు చేయించుకుంటామని, పరీక్షా నివేదికలను సైతం ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. రసమయి బాలకిషన్ కూడా...