డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపనే లక్ష్యం…..యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఘట్కేసర్‌ సీఐ బాలస్వామి

ఘట్కేసర్‌, సెప్టెంబర్‌ 15 (ప్రజావాణి): డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఘట్కేసర్‌ సీఐ ఎం. బాలస్వామి పిలుపునిచ్చారు. మర్రిపల్లిగూడ స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన ‘గణేష్‌ సురక్ష సంకల్ప్‌–2026’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం జీవితాలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని, నేరాల కారణంగా భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు....