prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 2:58 pm Digital Edition : PRAJA VANI

డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుదాము

డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుదాము

కరీంనగర్ మారథాన్ లో పాల్గొన్న మందమర్రి రన్నర్స్ సభ్యులు

*మన ప్రజావాణి*
మందమర్రి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం కరీంనగర్ రన్నర్స్ అండ్ సైకిలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీల్లో మందమర్రి రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు గుడికందుల రమేశ్, ముడారపు అనిల్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు (డ్రగ్స్) వ్యతిరేకంగా నిర్వహించిన ఈ మారథాన్‌లో సుమారు 5,000 మంది రన్నర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మందమర్రి రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు గుడికందుల రమేశ్, ముడారపు అనిల్ మాట్లాడుతూ.. నిత్యం రన్నింగ్, వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ రోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచించారు
మందమర్రి పట్టణ ప్రజల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచేందుకు త్వరలో మందమర్రిలో మారథాన్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు వారు తెలిపారు. 3కె, 5కె, 10కె విభాగాల్లో రన్ నిర్వహించి యువతతో పాటు అన్ని వయసుల వారిని ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు..