prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 11:47 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

డీజేలతో ప్రాణాపాయం: నిమర్జన వేడుకల్లో డీజే సౌండ్స్ నిషేధం!

ఇటీవల డీజే శబ్దాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, మన గ్రామంలో అలాంటి విపత్తులు జరగకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని ఉమ్మడి వెల్గటూర్ ఎస్సై పి ఉదయ్ కుమార్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు ఏర్పాటు చేయవద్దని హెచ్చరించారు. ఒకవేళ చాటుమాటుగా డీజేలు పెట్టి, ఎవరికైనా ప్రాణహాని జరిగితే డీజే నిర్వాహకులు, కమిటీ బాధ్యులపై కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు. పరికరాలను సీజ్ చేసి, బాధ్యులను రిమాండ్‌కు పంపుతామని స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.