prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 6:57 pm Digital Edition : PRAJA VANI

డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు

*డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు…*

*కుటుంబ సమేతంగా హాజరైన జిల్లా ఎస్పీ.*

*జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయు రారోగ్యాలతో ఉండాలి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్.*

*సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*

వినాయక చవితి పర్వదినాన్ని పురస్క రించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ సోమవారం రోజు కుటుంబ సమేతంగా భువనగిరి డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు , పోలీసు అధికారులు , సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సుల తో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గా , ఆనందంగా , సుఖ సంతోషాలతో , సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది తమ కుటుంబాలతో కలిసి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని , అదే సమయంలో ప్రజలందరూ పరస్పర సహకారం , సోదరభావంతో వినాయక చవితి వేడుకలను శాంతి యుతంగా , సురక్షితంగా నిర్వహించుకోవాలని ఎస్పీ కోరారు.