prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 8:40 pm Digital Edition : PRAJA VANI

డిజిటల్ భూ ‘ రీ ‘ సర్వేను వేగవంతం చేయాలి.

డిజిటల్ భూ ‘ రీ ‘ సర్వేను వేగవంతం చేయాలి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్

బూర్గంపాడు ( ప్రజావాణి) న్యూస్ సెప్టెంబర్,20,.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న భూ ‘ రీ ‘సర్వే ను వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. అందులో భాగంగా బూర్గంపాడు మండలంలోని అంజనాపురం గ్రామంలో జరుగుతున్న డిజిటల్ భూ , రీ’ సర్వే పనులను శనివారం అయన పరిశీలించరు.

ఈసందర్బంగా సర్వేలో ఎదురవుతున్న సమస్యలను రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు.
సర్వే ప్రక్రియకూ ప్రజలు సహకరించలని, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పనులను పూర్తి చెయ్యాలని సూచించారు.
అనంతరం సర్వేలో ఎదురవుతున్న సమస్యలు, రైతులు మరియు భూ యజమానులు నుండి వస్తున్న సందేహాలను అడిగి తెలుసుకున్నరు.

జిల్లాలో 118 సర్వే నెంబర్ల పరిధిలో 1863 ఎకరాలకు గాను 1698 ఎకరాల భూమి సర్వే పూర్తయినట్లు అధికారులు కలెక్టర్ కు తెలియజేశారు.
మిగిలిన భూముల సర్వేను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ నేరు గా సర్వే సజావుగా పూర్తి అవ్వడానికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.

ఈ పరిశీలనలో బూర్గంపాడు తహసిల్దార్ ప్రసాద్ , పినపాక పట్టి నగర్ సర్పంచ్ బానోత్ పద్మ , ఉప సర్పంచ్ తోటమల్ల వెంకటరమణ సర్వే సిబ్బంది స్థానిక భూ యజమానులు పాల్గొన్నారు