డాక్టర్ రాజేష్‌కు ఘన సన్మానం

డాక్టర్ రాజేష్‌కు ఘన సన్మానం డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 27 ప్రజావాణి : కురవి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అవిరె మోహన్‌రావు కుమారుడు డాక్టర్ రాజేష్ పీజీ ఎంట్రెన్స్‌లో 20 వేల ర్యాంకు సాధించిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రకాశ్ ఎలక్ట్రికల్స్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త నాళ్ల వీరన్న దంపతులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో వైద్య రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు....