prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 7:29 pm Digital Edition : MAHESH MEDCHAL

డబిల్‌పూర్ మల్కా చెరువు కట్టపై స్ట్రీట్ లైట్ల ఏర్పాటు

“డబిల్‌పూర్ మల్కా చెరువు కట్టపై స్ట్రీట్ లైట్ల ఏర్పాటు*

*గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తించి స్పందించిన కౌన్సిలర్లు*

*రాత్రి వేళల్లో రాకపోకలకు ఇబ్బందులు తొలగింపు*

మేడ్చల్: నేడు, న్యూస్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామంలో మల్కా చెరువు కట్టపై గత కొద్ది రోజులుగా స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన కౌన్సిలర్లు ఆరిఫ్, హరీష్, సారా ముత్యాలు గౌడ్ స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి చెరువు కట్టపై స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయించారు.

మల్కా చెరువు కట్టపై సరైన వెలుతురు లేకపోవడంతో రాత్రి సమయంలో అటుగా వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడేవారు. చీకటి కారణంగా రాకపోకలకు ఆటంకం కలగడంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానిక కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రామ ప్రజల సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులతో చర్చించి స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.

కౌన్సిలర్ల చొరవతో మల్కా చెరువు కట్టపై స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో రాకపోకలకు సౌకర్యం కలిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు ప్రసాద్ గౌడ్, నర్సింగ్ గౌడ్, హైవే సారా శ్రీనివాస్ గౌడ్, మాజీ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సల్ల వెంకటేష్ యాదవ్, మల్లేష్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.