*ప్రజావాణి న్యూస్ – మల్యాల
*ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్*
*మల్యాల , సెప్టెంబర్ 19 (ప్రజావాణి):*
మల్యాల మండలంలో సంచలనం సృష్టించిన ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎస్సై ఎస్. సందీప్ తెలిపిన వివరాల ప్రకారం, మల్యాల లకు చెందిన తపాలా బాబు (42) తండ్రి సాయిలు, వడ్డెర, అనే వ్యక్తి తన ముగ్గురు సహచరులు కోట శ్రీను, పల్లెపు సురేష్, సూర సురేష్ లతో కలిసి రాత్రి వేళల్లో ట్రాన్స్‌ఫార్మర్లను ప్రత్యేక సామగ్రితో పగులగొట్టి అందులోని కాపర్ వైర్లను దొంగిలిస్తున్నాడు. దొంగిలించిన వైర్లను ఆటోలో తరలించి ముద్దలుగా చేసి విక్రయించి వచ్చిన డబ్బును నలుగురు పంచుకుంటున్నారు.
ఈ ముఠాలోని ముగ్గురిని ఇప్పటికే ఈ నెల 17వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా, ప్రధాన నిందితుడు తపాలా బాబు పరారీలో ఉన్నాడు. శుక్రవారం ఉదయం నిందితుడు మల్యాల శివారు బైపాస్ దారిలో బైక్ పై వెళ్తున్నాడన్న పక్కా సమాచారంతో ఎస్సై సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
అతని నుండి 15 కిలోల కాపర్ వైర్, ఒక అపాచీ టూ వీలర్ బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.