ట్యాంక్ నగర్ టైటాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడి శోభాయాత్ర

*ట్యాంక్ నగర్ టైటాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడి శోభాయాత్ర* రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 26 (ప్రజావాణి) మంచాల 11వ వార్డులోని ప్రతిష్ఠించిన వినాయకుడికి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు ముగియడంతో గణనాథుడి నిమజ్జనాన్ని పురస్కరించుకుని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా భక్తులు విశ్వసిస్తారు. విద్య, జ్ఞానం, శుభకార్యాలకు శ్రీకారం చుట్టే ముందు గణపతిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా చిన్నారులు సైతం ఎంతో భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలో పాల్గొని గణనాథుడికి జైకొట్టారు. పిల్లల్లో భక్తి...