prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 9:19 pm Digital Edition : PRAJA VANI

ట్యాంక్ నగర్ టైటాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడి శోభాయాత్ర

*ట్యాంక్ నగర్ టైటాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడి శోభాయాత్ర*

రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 26 (ప్రజావాణి) మంచాల 11వ వార్డులోని ప్రతిష్ఠించిన వినాయకుడికి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు ముగియడంతో గణనాథుడి నిమజ్జనాన్ని పురస్కరించుకుని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.

వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా భక్తులు విశ్వసిస్తారు. విద్య, జ్ఞానం, శుభకార్యాలకు శ్రీకారం చుట్టే ముందు గణపతిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా చిన్నారులు సైతం ఎంతో భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలో పాల్గొని గణనాథుడికి జైకొట్టారు. పిల్లల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

శోభాయాత్రలో యువత, కాలనీ వాసులు, చిన్నారులు, మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణపతి నామస్మరణలతో ట్యాంక్ నగర్ ప్రాంతం భక్తిమయంగా మారింది.

కార్యక్రమంలో 11వ వార్డు సభ్యుడు గ్యార శేఖర్‌తో పాటు బుస్సు అంజన్న, కడారి ఐలేష్, గూదె మల్లేష్, రావుల విష్ణు, బాలం రాజు, దూసరి శంకర్, మల్గా మహేష్, రావుల ప్రవీణ్, బుస్సు కన్న, గూదె విష్ణు, రావుల శేఖర్, పుడత అజయ్ తదితరులు పాల్గొన్నారు.