టీయూడబ్ల్యూజే..
మండల అధ్యక్షులుగా మద్ది వెంకటేశ్వర్లు..
ప్రజావాణి నెల్లికుదురు:టీయూడబ్ల్యూజే-143 నెల్లికుదురు మండల కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల కేంద్రంలో నెల్లికుదురు విద్యాసంస్థల సముదాయ ఆవరణంలో టియుడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య,కోఆర్డినేటర్ గాడి పెల్లి శేఖర్,జిల్లా కమిటీ సభ్యులు జంపాల చక్రధర్ పర్యవేక్షణలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
టియుడబ్ల్యూజే అధ్యక్షులుగా మన తెలంగాణ దినపత్రికకు చెందిన మద్ది వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా సాక్షి విలేఖరి బైరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఆంధ్రజ్యోతి కంట్రిబ్యూటర్ మల్యాల నరసయ్య, సహాయ కార్యదర్శిగా నమస్తే తెలంగాణ జర్నలిస్టు మస్కపురి సుధాకర్, కోశాధికారి జెల్ల ఉపేందర్ లను ఎంపిక చేశారు.కార్యవర్గ సభ్యులుగా ప్రజా జ్యోతి రిపోర్టర్ పోరండ్ల లక్ష్మయ్య,బహుజన టీవీ విలేకరి జిలకర శ్రీధర్
లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండలాధ్యక్షుడుగా నియామకానికి సహకరించిన జిల్లా నాయకులు గుట్టయ్య,శేఖర్ చక్రధర్,లతోపాటు, మండల విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు.