టీమ్ భగత్‌సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం
ఘట్కేసర్, సెప్టెంబర్ 23 (ప్రజావాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని బాలాజీనగర్ మూడుగుళ్ల సమీపంలో టీమ్ భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా గణనాథునికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువత భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుండాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు రాజబోయిన వినయ్ యాదవ్, కుమ్మరి వంశీ, ధర్మపురి భార్గవ్, గిలికపల్లి భరత్, బి....