prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:40 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

టీకాలతోనే చిన్నారులకు సంపూర్ణ రక్షణ

టీకాలతోనే చిన్నారులకు సంపూర్ణ రక్షణ

పాపయ్యపేటలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం

చెన్నారావుపేట సెప్టెంబర్ 09 ప్రజావాణి

చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడేందుకు సకాలంలో టీకాలు వేయించడం ఎంతో అవసరమని ఆరోగ్య సిబ్బంది సూచించారు. చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు నిర్ణీత సమయంలో టీకాలు వేయించి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. టీకాలు వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే వాటిని నిరోధించే రక్షణ కవచాలుగా పనిచేస్తాయని తెలిపారు. పోలియోతో పాటు పలు అంటువ్యాధులను అరికట్టడంలో టీకాలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం కాంతి, ఆశా కార్యకర్తలు సాలమ్మ, లలిత, నిర్మల, రమ, సుజాత, కమలాదేవి తదితరులు పాల్గొన్నారు.