prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 8:15 pm Digital Edition : PRAJA VANI

టి యు డబ్ల్యూ జే చండూరు మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

టి యు డబ్ల్యూ జే చండూరు మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోనీ స్థానిక మున్సిపాలిటీలోని బారతి చంద్ర గార్డెన్లో టీయూడబ్ల్యూజే చండూరు మండల కమిటీ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా అధ్యక్షులు గుండగోని జయ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చండూరు మండలం టియుడబ్ల్యూజే కమిటీ అధ్యక్షులుగా ఆడెపు పరమేశ (10 టి.వి), ప్రధాన కార్యదర్శిగా వరికుప్పల సురేష్ లను (నమస్తే తెలంగాణ) ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టియుడబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, నల్లగొండ జిల్లా టియుడబ్ల్యూజే ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్, రాష్ట్ర నాయకులు గోలీ విజయకుమార్, నల్గొండ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జానయ్య, నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలేంక గురుపాదం, టీయూడబ్ల్యూజే మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు బొడ్డు సతీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కోడి రాములు చండూరు మండలంలోని వివిధ పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తదితరులు పాల్గొన్నారు.