టి.బి. క్షయ వ్యాధి నివారణ పై అవగాహన సదస్సు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు ప్రభుత్వ దవాఖాన లో టి.బి క్షయ, టి.బి ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా చండూరు మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు హాజరై టి.బి క్షయ వ్యాధి నివారణ తగిన జాగ్రత్తలు, సూచనలు గురించి వివరించారు. అలాగే ఎఐ లో ఛాతి ఎక్స్ రే ద్వారా టి.బి పరీక్ష చేసుకోవచ్చు, టీ.బి క్షయ లక్షణాలు అనేవి మానవ శరీరంలో వారానికి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించటడం, తెమడ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఇలా ఉంటే వెంటనే ప్రభుత్వం దవాఖాన లో డాక్టర్లు ను సంప్రదించి వారి సూచనలను పాటించాలని చెప్పారు. తెమడ పరీక్ష – సిబి ఎన్ఎఎటి వంటి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని, ఈ టి.బి బారిన పడిన వారు భయపడకుండా ఉంటూ , ప్రభుత్వం ఇచ్చే 6 నెలలు ఉచిత మందులు వాడాలి, అదే విధంగా క్షయ బారిన పడిన వారికి ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన ద్వారా నెలకు 1000₹ రూపాయలు మంచి ఆహారం కొరకు ఇస్తుంది అని , అలాగే స్వచ్ఛంద సంస్థలు నుండి మంచి “న్యూట్రీషన్ ఫుడ్ బాస్కెట్ ” కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మరియు డా. మాస రాజు ఈ సందర్భంగా ప్రజలకు టి.బి క్షయ నివారణ, అవగాహనను గురించి తెలియజేశారు.