టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి:
టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే గౌతు శిరీష పలాస ప్రజావాణి ప్రతినిధి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష సందర్శించి, పనుల పురోగతిని సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్న ఆమె, మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు వీలైనంత త్వరగా వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నిర్మాణ పనుల్లో జాప్యానికి...