ఘట్కేసర్, సెప్టెంబర్ 15 (ప్రజావాణి): ఘట్కేసర్–ఎదులాబాద్ రోడ్డులోని జై గట్టు మైసమ్మ ఆటో స్టాండ్‌లో ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సెప్టెంబర్ 16న మధ్యాహ్నం జై గట్టు మైసమ్మ ఆటో స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో తోట రాజు, అజ్జల రాజేష్, మార్కల రాజు, జి. నర్సింహ, శ్రీశైలం, రవి, మైసయ్య, అజ్జల శ్రీను, బల్వంత, కె. శ్రీను, శంకర్, విజయ్, జంగయ్యతో పాటు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.