జైపూర్ ఎస్టీపీపీలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం

జైపూర్, సెప్టెంబరు 15,ప్రజావాణి: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) ప్రాంగణంలో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా రక్తనిధి కేంద్రం సహకారంతో మంగళవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సుధేష్ జాకర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి కమాండెంట్ ఛాన్స్ బార్ సర్కార్, డిప్యూటీ కమాండెంట్ మనిదీప్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ శిబిరంలో 47 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా జనరల్...