prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 9:23 pm Digital Edition : PRAJA VANI

జే రవిందర్ సేవలు చిరస్మరణీయం

*జే రవిందర్ సేవలు చిరస్మరణీయం*

* *మన ప్రజావాణి* మందమర్రి:-

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు,కార్మికుల హక్కుల సాధన కోసం బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం జే రవీందర్ చేసిన సేవలు చిరస్మరనీయమని మాజీ ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌ లో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు స్వర్గీయ జే రవీందర్ ద్వాదశ దిన కర్మ కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి జే రవీందర్ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, హాజరై, రవీందర్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముందుగా రవీందర్ చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా నిలుస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన రవీందర్ మన మధ్య లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి, పట్టణ ప్రజలకు, కార్మిక వర్గానికి తీరని లోటని తెలిపారు. రవీందర్ తో తనకు ఉన్న అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని, ఆయన చూపిన ఉద్యమ స్ఫూర్తి, పార్టీ పట్ల నిబద్ధత అందరికీ ఆదర్శమన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఈ కష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారి కుటుంబానికి ప్రసాదించాలని కోరుకున్నారు. జై రవీందర్ కు నివాళులు అర్పించిన వారిలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, సింగరేణి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, పాత్రికేయులు, బిఆర్ఎస్ పార్టీ అన్ని విభాగాల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు అధ్యక్షులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా నాయకులు, మహిళ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు, కులసంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు, కలరు.