జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ ఉద్యోగుల ఆందోళన కోలాటాలతో వినూత్న నిరసన
నంగునూరు, ప్రజావాణి,సెప్టెంబర్ 7: జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ ఉద్యోగులు కోలాటాలతో నిరసన తెలిపారు. రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు సోమవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 22వ రోజు భోజన విరామ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కోలాటాలు ఆడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.తెలంగాణ పాలిటెక్నిక్ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ సహ అధ్యక్షుడు...