prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:49 am Digital Edition : PRAJA VANI

జీఎంఆర్‌ జన్మదినం.. జనహిత వేడుక

*జీఎంఆర్‌ జన్మదినం.. జనహిత వేడుక!

*ఐలేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు..

*ఈఎస్‌ఐ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

రామచంద్రపురం, సెప్టెంబర్‌ 19 (ప్రజావాణి): పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు రామచంద్రపురంలో ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్‌ నాయకుడు ఐలేష్‌ ఆధ్వర్యంలో బీహెచ్‌ఈఎల్‌ బస్‌డిపో ఎక్స్‌రోడ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద డైమండ్‌ పాయింట్‌లో కేక్‌ కటింగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేక్‌ కట్‌ చేసి జీఎంఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఈఎస్‌ఐ ఆసుపత్రికి చేరుకున్న నాయకులు చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పండ్లు పంపిణీ చేశారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం పలువురిని ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జీఎంఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ అంజయ్యతో పాటు రామచంద్రపురం, భారతీనగర్‌ డివిజన్లకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, జీఎంఆర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.