*జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ (DLVMC) కి దరఖాస్తులకు ఆహ్వానం*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి): జనగామ జిల్లా నివాసులలో అర్హత కలిగిన వారి నుండి, SCs మరియు STs (Prevention of Atrocities) Rules, 1995 లోని Rule 17 ప్రకారం, జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, జనగామ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ (DLVMC) లో అధికారేతర సభ్యులుగా (Non-Official Members) నియమించుటకు దరఖాస్తులు ఆహ్వానించుతున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ బి. విక్రమ్ శనివారం ok ప్రకటనలో తెలిపారు.
ఈ కమిటీ జిల్లాలో SCs మరియు STs (Prevention of Atrocities) Act, 1989 అమలును సమీక్షించడంతో పాటు, అఘాయిత్యాల బాధితులకు ఉపశమనం మరియు పునరావాసం కల్పించడం, కేసుల ప్రాసిక్యూషన్ తదితర అంశాలను పర్యవేక్షిస్తుందన్నారు.
*1. సభ్యుల స్థానాలు:*
(i) షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఐదుగురు సభ్యులు. వీరిలో SC(A) మరియు SC(C) ఖాళీలు కలవు.
(ii) SC/ST సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు (NGOs) తో అనుబంధం కలిగిన ఇతర వర్గాలకు చెందిన గరిష్టంగా ముగ్గురు సభ్యులు.
పదవీకాలం: రెండు సంవత్సరాలు
పదవి: గౌరవ ప్రాతిపదికన (Honorary)
*2. అర్హతలు:*
– జనగామ జిల్లాలో సాధారణంగా నివసించే వయోజనుడు/వయోజనురాలు అయి ఉండాలి.
– సమర్థ అధికారి జారీ చేసిన కమ్యూనిటీ/కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. SC/ST స్థానాలకు సంబంధించి ఉపవర్గం (Sub-category) కూడా ధృవీకరణ పత్రంలో ఉండాలి.
– SC/ST సంక్షేమం లేదా అఘాయిత్యాల బాధితులకు సహాయం అందించే రంగంలో సామాజిక సేవ చేసినట్లు నిరూపించగల రికార్డు కలిగి ఉండాలి.
– నైతిక పతనం (Moral Turpitude) కు సంబంధించిన ఏదైనా నేరంలో దోషిగా నిర్ధారించబడిన వ్యక్తి అయి ఉండరాదు లేదా అటువంటి నేరానికి సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటూ ఉండరాదు.
– ఏ రాజకీయ పార్టీకి చెందిన పదాధికారి (Office-bearer) అయి ఉండరాదు.
*3. దరఖాస్తు విధానం:*
నిర్దేశిత దరఖాస్తు నమూనా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, జనగామ కార్యాలయంలో మరియు జిల్లా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.
*దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన పత్రాలు:*
1. బయోడేటా
2. కమ్యూనిటీ/కుల ధృవీకరణ పత్రం
3. నివాస ధృవీకరణ పత్రం
4. ఇద్దరు వ్యక్తుల రిఫరెన్సులు
5. సమ్మతి మరియు ఆసక్తి ప్రకటన (Consent-cum-Willingness Declaration)
6. క్రిమినల్ పూర్వచరిత్రకు సంబంధించిన స్వీయ ప్రకటన(Self-Declaration)
పూర్తి చేసిన దరఖాస్తును జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, జనగామ కార్యాలయానికి తేది: 24.09.2026 సాయంత్రం 5:00 గంటల లోపు చేరే విధంగా సమర్పించాలి.
*4. ఎంపిక విధానం:*
దరఖాస్తులను అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఉన్న కమిటీ పరిశీలిస్తుంది. అభ్యర్థుల పూర్వచరిత్రను కమిషనర్ ఆఫ్ పోలీస్ ద్వారా ధృవీకరించిన అనంతరం, జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
ఎటువంటి రూపంలోనైనా పైరవీలు/ప్రచారం (Canvassing) చేయడం అనర్హతకు దారితీస్తుంది. కేవలం దరఖాస్తు సమర్పించినంత మాత్రాన నియామకంపై ఎటువంటి హక్కు కలగదని తెలిపారు.